: స్పీకర్ వైఖరిని నిరసిస్తూ ఆందోళన చేస్తున్న డీఎంకే నేత స్టాలిన్ అరెస్ట్!


తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీ నేడు అట్టుడుకిపోయింది. విశ్వాసపరీక్షలో పళనిస్వామికి ఓటు వేసేందుకు అన్నాడీఎంకే ఎమ్మెల్యేలకు లంచం ఇచ్చారంటూ వచ్చిన స్టింగ్ ఆపరేషన్ వీడియోపై నేడు అసెంబ్లీలో దుమారం రేగింది. ఈ అంశంపై డీఎంకే సభ్యులు సభలో ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో డీఎంకే ఎమ్మెల్యేలను స్పీకర్ సస్పెండ్ చేశారు. స్పీకర్ వైఖరిని నిరసిస్తూ అసెంబ్లీ కాంప్లెక్స్ ముందు రోడ్డుపై ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ స్టాలిన్ బైఠాయించారు. స్టింగ్ ఆపరేషన్ పై సీబీఐ విచారణ జరపాలని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో స్టాలిన్ తో పాటు, ఇతర ఎమ్మెల్యేలను పోలీసులు అరెస్ట్ చేశారు.

  • Loading...

More Telugu News