: అయ్యన్నపాత్రుడిపై చంద్రబాబుకు ఫిర్యాదు చేస్తూ లేఖ రాసిన గంటా!


ఆంధ్రప్రదేశ్ లోని ఉత్తరాంధ్ర మంత్రుల మధ్య ఉన్న లుకలుకలు బయటపడ్డాయి. పలు సందర్భాల్లో మంత్రి అయ్యన్న పాత్రుడుకి, మరో మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఉన్న విభేదాలు బయటపడ్డప్పటికీ...ఈ సారి నేరుగా గంటా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడుకు లేఖ రాయడం కలకలం రేపుతోంది. అయ్యన్న పాత్రుడి వైఖరి వల్ల పార్టీకి తీవ్ర నష్టం కలుగుతోందని మంత్రి గంటా శ్రీనివాసరావు లేఖలో పేర్కొన్నారు. మంత్రి స్థాయిలో ఆయన చేసిన వ్యాఖ్యలు పార్టీ ప్రతిష్ఠను దెబ్బతీస్తున్నాయని, ఆయనను నియంత్రించాల్సిన అవసరం ఉందని గంటా అభిప్రాయపడ్డారు. విశాఖపట్టణంలో భూ కుంభకోణం జరిగిందన్న అయ్యన్న ఆరోపణలపై సీఐడీ దర్యాప్తు చేయించాలని ఆయన డిమాండ్ చేశారు. గతంలో కూడా అయ్యన్న చేసిన వ్యాఖ్యల వల్ల పార్టీకి నష్టం జరిగిందని ఆయన తెలిపారు. 

  • Loading...

More Telugu News