: వైఎస్ జగన్ ను కలిసిన తెలంగాణ మంత్రి ఈటల
వైసీపీ అధినేత జగన్ ను తెలంగాణ మంత్రి ఈటల రాజేందర్ కలిశారు. హైదరాబాదులోని జగన్ నివాసానికి వెళ్లిన ఈటల... తన కుమారుడి వివాహానికి హాజరు కావాలంటూ జగన ను ఆహ్వానించారు. వివాహ ఆహ్వాన పత్రికను అందజేశారు. ఇప్పటికే కుమారుడి వివాహానికి పలువురు రాజకీయ, సినీ ప్రముఖులను ఈటల ఆహ్వానించారు. ఈటల కుమారుడు నితిన్ పెళ్లి ఈ నెల 18న హైదరాబాద్ లోని హైటెక్స్ లో జరగనుంది. కుటుంబ సభ్యులతో పాటు న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన జగన్ గత శనివారం రాత్రి హైదరాబాద్ చేరుకున్న సంగతి తెలిసిందే.