: ఇంగ్లండ్ లో మోత మోగిస్తున్న కుమార సంగక్కర!


శ్రీలంక మాజీ కెప్టెన్, స్టార్ బ్యాట్స్ మెన్ కుమార సంగక్కర ఇంకా మెరుపులు మెరిపిస్తూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైరైనప్పటికీ... ఇంగ్లీష్ కౌంటీల్లో మోత మోగిస్తున్నాడు. వరుస శతకాలతో తనలో సత్తా ఇంకా ఉందన్న విషయాన్ని చాటి చెబుతున్నాడు. తాజాగా, కౌంటీ ఛాంపియన్ షిప్ లో భాగంగా యార్క్ షైర్ తో జరిగిన మ్యాచ్ లో మరో సెంచరీ బాది తన జట్టుకు విజయాన్ని అందించాడు. 121 బంతుల్లో 4 సిక్సర్లు, 9 ఫోర్లతో 121 పరుగులు చేసిన సర్రే టీమ్ ను గెలుపు బాటలో నడిపించాడు. ఈ క్రమంలో వంద సెంచరీలను సంగక్కర పూర్తి చేసుకున్నాడు. ఇందులో 39 లిమిటెట్ ఓవర్ల సెంచరీలు ఉండగా, 61 ఫస్ట్ క్లాస్ సెంచరీలు ఉన్నాయి.

  • Loading...

More Telugu News