: విజయసాయిరెడ్డీ, చెవిరెడ్డీ! 24 గంటల సమయం ఇస్తున్నాం.. నిరూపించండి: బుద్ధా వెంకన్న


వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వస్తుందనే భ్రమల్లో ఆ పార్టీ నేతలు బతుకుతున్నారని టీడీపీ ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న ఎద్దేవా చేశారు. ప్రభుత్వోద్యోగులు, వారి కుటుంబ సభ్యులను అంతు చూస్తామంటూ వైసీపీ నేతలు బెదిరిస్తున్నారని... వారు అధికారంలోకి వస్తే, రాష్ట్రం మొత్తం అల్లకల్లోలమవుతుందని చెప్పారు. చెవిరెడ్డి రౌడీ చరిత్ర అందరికీ తెలిసిందేనని అన్నారు. అభివృద్ధి పథంలో దూసుకుపోతున్న విశాఖపట్నం ప్రతిష్టను దెబ్బతీసేందుకే విజయసాయిరెడ్డి అక్కడే మకాం వేసి, రాద్ధాంతం చేస్తున్నారని విమర్శించారు. భూ కబ్జాల విషయాన్ని బయటపెట్టింది టీడీపీనే అని చెప్పారు. విజయసాయిరెడ్డి, చెవిరెడ్డిలు ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని... వారికి 24 గంటల సమయం ఇస్తున్నామని... ఈ లోగా వారు చేస్తున్న ఆరోపణలను నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. లేని పక్షంలో నోరును అదుపులో పెట్టుకుని, జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.

  • Loading...

More Telugu News