: లండన్ లో భారీ అగ్ని ప్రమాదం... చిక్కుకుపోయిన 200 మంది... రంగంలో 500 మంది అగ్నిమాపక సిబ్బంది!


లండన్ లోని ఎత్తైన భవనాల్లో ఒకటిగా పేరొందిన గ్రీన్ ఫెల్ టవర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. 27 అంతస్తుల గ్రీన్ ఫెల్ టవర్ లో చాలా ఫ్లాట్లు ఉన్నాయి. ఇంచుమించు భవనం మొత్తం మంటలు వ్యాపించాయి. సుమారు 200 మంది చిక్కుకుపోయారని సమాచారం. వారిని రక్షించేందుకు యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టారు. అగ్నికీలలు వేగంగా విస్తరిస్తుండడంతో 50 అగ్నిమాపక శకటాలతో 500 మంది సిబ్బంది మంటలార్పేందుకు రంగంలోకి దిగారు. దట్టమైన పొగలు, ఎగసిపడుతున్న అగ్నికీలలతో అక్కడి పరిస్థితి భీతావహంగా ఉంది.

  • Loading...

More Telugu News