: రజనీని మించిపోయిన శిశువు... సోషల్ మీడియాలో ట్రెండింగ్!


కలిసొచ్చే కాలంలో నడిచొచ్చే కొడుకు పుట్టాడన్నట్టు మొన్నటికి మొన్న ముంబైలోని ఓ ఆసుపత్రిలో పుట్టిన శిశువు పుట్టీపుట్టగానే నడుస్తూ సోషల్ మీడియాలో హోరెత్తిపోయిన సంగతి తెలిసిందే. తాజాగా ఆ బాలుడి బాటలోనే మరో బాలుడు ట్రెండింగ్‌ అవుతున్నాడు. సోషల్ మీడియాలో హోరెత్తిపోతున్న ఈ శిశువు పుట్టగానే తల కింద రెండు చేతులు పెట్టుకుని పోజు కొడుతున్నాడు. ఇది నిజమైన ఫొటోనా లేక ఫోటో షాప్ చేసినదో తెలియనప్పటికీ....రోజుల బాలుడు తలకింద తమిళ తలైవా రజనీకాంత్ లా చేతులు పెట్టుకుని ఫోజు కొడుతూ....ఔరా! అనిపిస్తున్నాడు. ఈ ఫోటోపై నెటిజన్లు ఆసక్తికరంగా స్పందిస్తున్నారు. అత్యధికులు రజనీకాంత్ చిన్ననాటి ఫోటో అని పేర్కొంటున్నారు. దీంతో పుట్టుకతోనే సెలబ్రిటీగా మారిపోయాడు. 

  • Loading...

More Telugu News