: తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ తో బిగ్ బాస్ ఎలా ఉంటుందంటే...!


స్టార్ మా టీవీ తెలుగులో భారీ స్థాయిలో బిగ్ బాస్ రియాలిటీ షోను అభిమానులకు పరిచయం చేయనుంది. ఈ షోకు ప్రముఖ నటుడు జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించనున్నాడు. ఈ మేరకు ఒప్పందం పూర్తైంది. త్వరలో ప్రసారం కానున్న ఈ కార్యక్రమం తెలుగు ప్రేక్షకులను అలరిస్తుందని చెబుతూ, ఈ షోకు సంబంధించిన వివరాలను మా టీవీ వెల్లడించింది. ఆ వివరాల్లోకి వెళ్తే... హిందీ బిగ్ బాస్ లో సామాన్యులు, సెలబ్రిటీలు పోటీ పడి టైటిల్ గెలుచుకుంటారు. తెలుగులో మాత్రం ప్రస్తుతానికి సామాన్యులకు అవకాశం లేదు. ప్రత్యేకంగా నిర్మించిన ఒక ఇంట్లో, సుమారు పన్నెండుమంది సెలబ్రిటీలను పంపి, తాళం వేస్తారు. వారికి అవసరమైన అన్ని వసతులూ ఈ ఇంట్లో కల్పిస్తారు.

 కనీసం సెల్‌ఫోన్ లు, టీవీలు, దినపత్రికలు వంటివి కూడా వారికి అందుబాటులో వుండవు. ఆ ఇల్లే వారి ప్రపంచం. ఏ ఫీలింగ్ నైనా ఇక అక్కడి వారితోనే పంచుకోవాలి. వారి ప్రతి కదలికను కెమెరాలు రికార్డ్‌ చేస్తుంటాయి. వాళ్ల నడవడికను, జీవన శైలిని ప్రేక్షకులు గమనిస్తుంటారు. విభిన్న రంగాలకు చెందిన, భిన్నమైన అభిరుచులు కలిగిన పలువురు సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే చోట ఎలా ఉంటారన్నదే ఈ షోలో ఆసక్తికరం అని మాటీవీ తెలిపింది. యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌ ఈ షోను తెలుగులో ప్రారంభించనుండడం ఎంతో సంతోషాన్నిస్తోందని మా టీవీ తెలిపింది. తెలుగు ప్రజల మనోభావాలను, విలువలను దృష్టిలో ఉంచుకొని, ఎప్పటికప్పుడు కొత్తదనం ఉండేలా ఈ షోను తీర్చిదిద్దనున్నామని తెలిపారు.

  • Loading...

More Telugu News