: కేశినేనికి నారా లోకేష్ ఫోన్... సంయమనం పాటించాలని హితవు!
టీడీపీ ఎంపీ కేశినేని నానికి మంత్రి నారా లోకేష్ ఫోన్ చేసి హితవు పలికారు. ఏపీలో ఆర్టీఏ అధికారులు అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారని ఇటీవల నాని తీవ్రంగా ఆరోపించారు. ఈ నేపథ్యంలో లోకేష్ నేరుగా ఎంపీకి ఫోన్ చేసి, సంయమనం పాటించాలని సూచించారు. ప్రైవేటు బస్సుల వివాదంపై ఎవరితో మాట్లాడవద్దని ఆదేశించారు. వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే పార్టీ ప్రతిష్ట దెబ్బతింటుందని హెచ్చరించారు. విదేశాల నుంచి తాను రాగానే దీనిపై అన్ని విషయాలు మాట్లాడుదామని సూచించారు. దీంతో దిగవచ్చిన కేశినేని నాని... తనకు పార్టీ, సీఎం చంద్రబాబు, మీరు ముఖ్యమని, మీరు చెప్పినట్టే చేస్తానని లోకేష్ తో చెప్పినట్టు తెలుస్తోంది.