: 2.4 కోట్ల రూపాయలు పలికిన కోహ్లీ పెయింటింగ్!
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ చిత్రపటానికి విపరీతమైన క్రేజ్ వచ్చింది. అతని పదేళ్ల ఐపీఎల్ ప్రస్థానాన్ని వర్ణిస్తూ సాషా జెఫ్రీ గీసిన పెయింటింగ్ ను లండన్ లో విరాట్ కోహ్లీ ఫౌండేషన్ వేలం వేయగా, బ్రిటిష్ ఇండియన్, పీజే పేపర్స్ సంస్థ సీఈవో పూనమ్ గుప్తా సుమారు 2.4 కోట్లు వెచ్చించి సొంతం చేసుకున్నారు. ఈ సందర్భంగా పూనమ్ గుప్తా మాట్లాడుతూ, ప్రస్తుత యువతరానికి చెందిన భారత క్రికెటర్లు సమాజం పట్ల బాధ్యతతో మెలగడం నచ్చిందని అన్నారు. ఒక వైపు మైదానంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటూనే... బయట విభిన్నంగా ఉండాలని కోరుకుంటున్నారని చెప్పారు. తన సమాజం హితం కోసం విరాట్ ఎంచుకొన్న కారణం తనకు బాగా నచ్చిందని, అందుకే దానిని కొనుగోలు చేశానని చెప్పారు.