: దేశంలో ఓ గ్రామానికి ట్రంప్ పేరు.. అలాంటిదేమీ లేదన్న భారత్


రాజస్థాన్‌లోని మేవాత్ ప్రాంతంలో ఓ గ్రామానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టనున్నట్టు వస్తున్న వార్తలను ప్రభుత్వం ఖండించింది. అటువంటిదేమీ లేదని తేల్చి చెప్పింది.

వాషింగ్టన్ డీసీలో ఓ కమ్యూనిటీ కార్యక్రమంలో  పాల్గొన్న సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకుడు బిందేశ్వర్ పాఠక్ మాట్లాడుతూ.. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నందుకు గాను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరును రాజస్థాన్‌లో ఓ గ్రామానికి పెట్టనున్నట్టు పేర్కొన్నారు.

ఈ వార్తలపై స్పందించిన రాజస్థాన్ ప్రభుత్వ అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వం వద్ద అటువంటి ప్రతిపాదన ఏమీ లేదన్నారు. ఏదైనా ఓ గ్రామానికి పేరు మార్చాలంటే అంతకుముందు చాలా తతంగమే ఉంటుందని, ఇప్పటి వరకైతే పేరు మార్చే ప్రతిపాదన ఏదీ లేదని పేర్కొన్నారు. పాఠక్ వ్యాఖ్యలపై స్పందించేందుకు రాజస్థాన్ ప్రభుత్వ రెవెన్యూ ముఖ్య కార్యదర్శి అలోక్ నిరాకరించారు.

  • Loading...

More Telugu News