: జూనియర్ ఎన్టీఆర్ టీవీషో కోసం ఎదురు చూస్తున్నాను: మంచు లక్ష్మి
హిందీలో ఎంతో పాప్యులర్ అయిన బిగ్ బాస్ షోను తెలుగులో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా రూపొందిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం బుల్లితెరపై ఇదే హాట్ టాపిక్‌గా మారింది. బిగ్‌బాస్‌లో మిమ్మల్ని కలుస్తాను అంటూ ఈ రోజు ఎన్టీఆర్ తన షో లుక్‌ను తన ట్విట్టర్ ద్వారా విడుదల చేయడంతో ఆయన అభిమానులు ఎంతో ఖుషీ అవుతున్నారు. త్వరగా వచ్చేయ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. యంగ్ టైగర్ అందరికి మరింత దగ్గర కాబోతున్నాడని మురిసిపోతున్నారు. తారక్ చేసిన పోస్ట్ పై స్పందించిన నటి మంచు లక్ష్మి ఆయన చేసిన పోస్టును షేర్ చేస్తూ ఆ షో కోసం ఎదురుచూస్తున్నానని పేర్కొంది. మొత్తానికి ఎన్టీఆర్ అందరిలోనూ ఆసక్తి రేపుతున్నాడు.