: పాము కాటేయడంతో.. తాను లేకుండా తన భార్య బతకలేదని ఆమె చేతిని కొరికేసిన భర్త!
పాముకాటుకి గురైన ఓ వ్యక్తి తాను ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోతే తన భార్య ఒంటరిగా ఎలా బతుకుతుందని అనుకుని ఆమె చెయ్యిని గట్టిగా కొరికేశాడు. దీంతో ఆమె స్పృహకోల్పోయింది. వారిద్దరినీ కుటుంబ సభ్యులు, స్థానికులు ఆసుపత్రికి తరలించగా ఆ భర్త మృతి చెందగా అతడి భార్య మాత్రం ప్రాణాలతో బయటపడింది. పూర్తి వివరాలు చూస్తే... బీహార్లోని సమస్తిపూర్ జిల్లాకి చెందిన శంకర్రాజ్ అనే వ్యక్తిని పాముకాటేసింది. తన భార్య కూడా తనతో పాటే చనిపోవాలని భావించిన ఆయన.. నిద్రపోతున్న తన భార్య అమిరి దేవి చెయ్యిని కొరికేశాడు. దీంతో వారిరువురూ స్పృహ కోల్పోయారు. ఆసుపత్రిలో తన భర్త చనిపోవడం చూసిన అమిరి దేవి తన భర్తతో పాటు తాను కూడా మృతి చెంది ఉంటే బాగుండేదని విలపించింది.