: పాక్ ప్రధానితో మా అధ్యక్షుడు మాట్లాడలేదా?.. అన్నీ అసత్యాలే!: భార‌త్‌ మీడియాపై చైనా ఆగ్రహం


చైనా బుద్ధి మార‌డం లేదు.. మ‌రోసారి పాక్‌ను వెన‌కేసుకొచ్చి, భార‌త్‌పై విమ‌ర్శ‌లు చేసింది. ఇటీవ‌ల పాకిస్థాన్‌లోని బ‌లూచిస్థాన్‌లో ఇద్ద‌రు చైనీయులు హ‌త్య‌కు గురైన విష‌యం తెలిసిందే. ఈ విష‌యాన్ని ప్ర‌స్తావిస్తూ చైనా మీడియా ‘గ్లోబల్ టైమ్స్’ ఓ క‌థ‌నం ప్ర‌చురించి త‌మ‌ టీచర్ల హత్యలో పాకిస్థాన్ ప్రమేయం ఏమీ లేదని ప్రకటించింది. పాకిస్థాన్ త‌మ‌ ‘ఐరన్ బ్రదర్’ అని పేర్కొంది. బలూచిస్థాన్‌లో త‌మ జాతీయుల‌ హత్యకు కారణం దక్షిణకొరియా క్రైస్తవ మిషనరీలేనని, ఈ ఘ‌ట‌నపై పాక్‌ను అస‌లు నిందించవలసిన అవసరం లేదని చైనా పేర్కొంది.

మ‌రోవైపు భార‌త్‌పై విరుచుకుప‌డుతూ చైనా-పాకిస్థాన్ సంబంధాల విష‌యంలో ఈ హత్యల ప్రభావం గురించి ఇండియన్‌ మీడియా అతిగా ప్రచారం చేస్తోందని పేర్కొంది. ఇటీవ‌ల ఆస్తానాలో జరిగిన సదస్సులో పాక్‌ ప్రధాన మంత్రితో త‌మ అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ భేటీ కాలేదంటూ వ‌చ్చిన వార్త‌లన్నీ అస‌త్యాల‌ని చెప్పింది.      

  • Loading...

More Telugu News