: అనుష్క ముందు కంటతడి పెట్టా!: విరాట్ కోహ్లీ


టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మల మధ్య బంధం అందరికీ తెలిసిందే. తాజాగా వారిద్దరి మధ్య చోటు చేసుకున్న ఓ అనుభవాన్ని విరాట్ ఓ ఇంటర్వ్యూలో పంచుకున్నాడు. అనుష్క ముందు తాను కంటతడి పెట్టానని... అయితే, అవి ఆనంద బాష్పాలని చెప్పాడు. గత నవంబర్ లో మొహాలీలో ఇంగ్లండ్ తో టెస్ట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడు అనుష్క తన వద్దే ఉందని చెప్పాడు. అప్పుడే వన్డే, టీ20లకు తనను కెప్టెన్ గా నియమిస్తున్నట్టు ఫోన్ వచ్చిందని... ఈ విషయాన్ని అనుష్కతో పంచుకునేటప్పుడు కంటతడి పెట్టానని తెలిపాడు. ఇదే విధంగా తనను టెస్ట్ కెప్టెన్ గా నియమించినప్పుడు కూడా మెల్ బోర్న్ లో అనుష్క తనతోనే ఉందని చెప్పాడు. అనుష్క తన అదృష్ట దేవత అని అన్నాడు.

  • Loading...

More Telugu News