: హైదరాబాద్లో దారుణం.. 18 నెలల పసికందును బాల్కనీలోంచి విసిరేశారు!
హైదరాబాద్లోని పాతబస్తీ ప్రాంతంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ముద్దులొలుకుతూ అమాయకంగా కనపడుతున్న ఓ 18 నెలల పాప బాల్కనీ నుంచి ఒక్కసారిగా కిందకు పడిపోయింది. పసికందును బాల్కనీలోంచి ఎవరో విసిరివేసినట్లు సీసీ కెమెరా దృశ్యాల ద్వారా అర్థమవుతోంది. బాల్కనీలోంచి ఆ పాప వేగంగా కిందపడిపోవడం, రోడ్డుకి మధ్యలో ఆ పాప పడిపోవడంతో ఆ పాపను ఎవరో బాల్కనీలోంచి తోసేసినట్లు బహదూర్ పుర పోలీసులు భావిస్తున్నారు. ఆ పాపను స్థానికులు చూసి వెంటనే ఆమె తల్లిదండ్రులకు ఈ విషయాన్ని చెప్పారు. ప్రస్తుతం ఆ పాప ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. ఆ పాప పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. ఆ పాప తలకు గాయాలయ్యాయని అన్నారు. ఆ పాప తల్లిదండ్రులే ఈ పని చేసుంటారని స్థానికులు చెబుతున్నారు.