: అదృశ్యమైన ఆరు రోజులకు పోలీసుల ముందు ప్రత్యక్షమైన కీర్తిశ్రీ... తల్లిదండ్రులపై ఆరోపణలు


ఈనెల 7వ తేదీన అదృశ్యమైన కర్నూలు జిల్లా ఇంటర్ విద్యార్థిని కీర్తి శ్రీ కథ సుఖాంతమైంది. కీర్తిశ్రీ ఆచూకీ కోసం ఆరు రోజులుగా పోలీసులు శ్రమిస్తుండగా, ఈ ఉదయం పోలీస్ స్టేషన్ లో ప్రత్యక్షమైన ఆమె, తన తల్లిదండ్రులపై సంచలన ఆరోపణలు చేసింది. తల్లిదండ్రులు తనకు వివాహం చేయాలని నిర్ణయించుకున్నారని, తాను వద్దన్నా బలవంత పెట్టారని ఫిర్యాదు చేసింది. ఇప్పట్లో పెళ్లి చేసుకోవడం ఇష్టం లేని తాను కాలేజీ నుంచి ఇంటికి వెళ్లకుండా పారిపోయానే తప్ప, తననెవరూ కిడ్నాప్ చేయలేదని స్పష్టం చేసింది. కాగా, కీర్తిశ్రీ తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ ఇస్తామని, ఇప్పట్లో వివాహం చేయవద్దని సూచించి, ఆమెను అప్పగిస్తామని పోలీసులు వెల్లడించారు.

  • Loading...

More Telugu News