: రాష్ట్రానికి కిరణ్ కుమార్ రెడ్డే ఆఖరి కిరణం: కోదండరాం


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి ఆఖరి కిరణమవుతారని తెలంగాణ రాజకీయ ఐకాస ఛైర్మన్ కోదండరాం వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 24న జరగనున్న సడక్ బంద్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన షాద్ నగర్ లో తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు. 'సడక్ బంద్' కార్యక్రమాన్ని జయప్రదం చేయడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి మరోసారి తెలంగాణ సత్తా తెలియజేయాలని ఆయన అన్నారు.

తెలంగాణ ప్రజలకు చెప్పులు వేసుకోవడం నేర్పింది తామేనన్న సీమాంధ్ర నేతలు.. ఇక్కడి వారికి అన్నం తినడం, నీరు తాగడం కూడా తామే నేర్పామని అంటారని కోదండరాం ఎద్దేవా చేశారు. తెలంగాణ ప్రజలకు జరిగిన అవమానాలకు సడక్ బంద్ రోజున సమాధానం చెబుతామని ఆయన హెచ్చరించారు. 

  • Loading...

More Telugu News