: తెలుగు 'బిగ్ బాస్' జూనియర్ ఎన్టీఆర్!


ఇంగ్లిష్ బిగ్ బ్రదర్ షోకి రీమేక్ వెర్షన్ హిందీ బిగ్ బాస్ షోకి సల్మాన్ ఖాన్ పాప్యులారిటీ తెచ్చిపెట్టిన సంగతి తెలిసిందే. కలర్స్ ఛానెల్ లో ప్రసారమయ్యే ఈ బిగ్ బాస్ షోను ఆ తరువాత వివిధ భాషల్లో టీవీ ఛానెళ్లు నిర్వహించాయి. కన్నడ, తమిళ వెర్షన్ లు అక్కడి టీవీ అభిమానులు అలరించాయి. దీంతో తెలుగులో కూడా బిగ్ బాస్ ను పరిచయం చేయాలని మాటీవీ భావిస్తోంది. ఈ నేపథ్యంలో ఈ షోను నిర్వహించేందుకు ప్రణాళికలు రచించింది.

అందులో భాగంగా తెలుగులో బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా జూనియర్ ఎన్టీఆర్ ను ఖరారు చేసింది. వాక్చాతుర్యం కలిగిన ఎన్టీఆర్ ను వ్యాఖ్యాతగా ఎంచుకోవడం ద్వారా భారీ సంఖ్యలో ఉన్న అతని అభిమానులను అలరించడంతో పాటు బుల్లితెర అభిమానుల సంఖ్యను పెంచుకోవాలని భావిస్తోంది. ఈ నేపథ్యంలో జూనియర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బిగ్ బాస్ ప్రారంభం కానుందని అధికారికంగా ప్రకటించింది. దీనిని జూనియర్ ఎన్టీఆర్ కూడా తన ఫేస్ బుక్ పేజ్ లో పోస్టు చేశారు.

  • Loading...

More Telugu News