: సినారె కడచూపు కోసం హైదరాబాద్ వస్తున్న చంద్రబాబు
ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సి.నారాయణరెడ్డి పార్థివదేహానికి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నివాళి అర్పించనున్నారు. దీనికోసం ఆయన ఈ సాయంత్రం ప్రత్యేకంగా హైదరాబాదుకు వస్తున్నారు. వచ్చీరాగానే సినారె నివాసానికి చేరుకుని ఆయనకు నివాళి అర్పించి, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారు. సినారె భౌతికకాయానికి ఇప్పటికే పలువురు ప్రముఖులు నివాళులు అర్పించారు. ఆయన అంత్యక్రియలు రేపు అధికారిక లాంఛనాలతో జరగనున్నాయి.