: పోలీస్ స్టేషన్ ను తగులబెట్టాలని కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలు... వీడియో ఫుటేజ్ ఉండటంతో కేసు నమోదు


నిరసన చేస్తున్న వారితో పోలీస్ స్టేషన్ ను తగులబెట్టాలని మధ్యప్రదేశ్ కాంగ్రెస్ శాసనసభ్యురాలు శకుంతలా ఖాతిక్ ఆగ్రహంగా చెబుతున్న వైనం వీడియో కెమెరాలకు చిక్కగా, దానినే సాక్ష్యంగా తీసుకున్న పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టారు. నిరసన చేస్తున్న రైతుల వద్దకు వచ్చిన ఆమె, కరేకా స్టేషన్ ను నామరూపాల్లేకుండా చేయాలని సూచించారు. గత వారంలో ఐదుగురు రైతులు పోలీసు కాల్పుల్లో మరణించడంపై కరేకా ప్రాంత ప్రజలు నిరసన చేపట్టారు. ఓ వైపు పోలీసులు శాంతంగా ఉండాలని రైతులకు విజ్ఞప్తి చేస్తున్న సమయంలోనే ఆమె ఈ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. స్టేషన్ ను తగులబెట్టాలని పదేపదే సూచించారు. మహిళా ఎమ్మెల్యే వ్యాఖ్యలపై మరింత లోతుగా విచారణ జరుపుతున్నామని పోలీసులు తెలిపారు.

  • Loading...

More Telugu News