: మాండసౌర్ వెళ్లి రైతులకు మద్దతు తెలిపిన హార్దిక్ పటేల్


మధ్యప్రదేశ్ లోని మాండసౌర్ లో రైతు ఆందోళనకు గుజరాత్ పటీదార్ అనామత్ ఆందోళన్ నేత హార్దిక్ పటేల్ మద్దతు తెలిపారు. గుజరాత్ కు ఆరు నెలలపాటు దూరంగా గడపాలన్న న్యాయస్థానం ఆదేశాలతో ఆ రాష్ట్రానికి దూరంగా ఉన్న హార్దిక్ పటేల్ మధ్యప్రదేశ్ లోని మాండసౌర్ లోని నీముచ్ ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రైతులకు మద్దతుగా ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రైతుల న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళన మరింత తీవ్రరూపం దాల్చుతుందని తెలిపారు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఆయనను, అనుచరులను అదుపులోకి తీసుకున్నారు. 

  • Loading...

More Telugu News