: ఇండియాలో ఓ గ్రామానికి డొనాల్డ్ ట్రంప్ పేరు!


భారత్ లో ఓ గ్రామానికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు పెట్టబోతున్నట్టు ప్రముఖ సామాజిక కార్యకర్త, సులభ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపకులు బిందేశ్వర్ పాతక్ తెలిపారు. ఇండియా, అమెరికా దేశాల మధ్య సంబంధాలను మరింత మెరుగు పరిచేందుకు ఆయన కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా ఓ గ్రామానికి ట్రంప్ పేరు పెడుతున్నట్టు తెలిపారు. వాషింగ్టన్ లో ఓ కమ్యూనిటీ ఈవెంట్ లో పాల్గొన్న ఆయన... ఈ విషయాన్ని అక్కడ ప్రకటించారు. ఆ గ్రామం రాజస్థాన్ లోని మేవాట్ ప్రాంతంలో ఉందని... ప్రస్తుతం అభివృద్ధి దశలో ఉందని చెప్పారు. స్వచ్ఛ భారత్ కోసం తామంతా ఎంతో శ్రమిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రవాస భారతీయులంతా భాగస్వాములు కావాలని ఆయన కోరారు.

  • Loading...

More Telugu News