: పని మనిషిపై భర్త అత్యాచారం కేసులో.. శశికళ పుష్ప అరెస్ట్ పై హైకోర్టు స్టే!


అన్నాడీఎంకే బహిష్కృత రాజ్యసభ సభ్యురాలు శశికళ పుష్ప అరెస్ట్ పై మధురై హైకోర్టు బెంచ్ స్టే విధించింది. ఈ నెల 14వ తేదీ వరకు ఆమెను అరెస్ట్ చేయరాదంటూ ఆదేశారు జారీ చేసింది. కేసు వివరాల్లోకి వెళ్తే, శశికళ పుష్ప భర్త తనపై అత్యాచారానికి పాల్పడ్డారంటూ భానుమతి అనే పని మనిషి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో, కేసును వెనక్కి తీసుకోవాలంటూ శశికళ తదితరులు తనను బెదిరించారంటూ ఆమె దిసైవినై పోలీసులతో పాటు, డీజీపీ కార్యాలయంలో కూడా ఫిర్యాదు చేసింది.

దీంతో శశికళ పుష్పతో పాటు ఆమె భర్త తిలకన్, తల్లి గౌరిలపై పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అయితే, అరెస్ట్ కాకుండా ఉండేందుకు వీరు మధురై హైకోర్టు బెంచ్ లో యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్లు పెట్టుకున్నారు. ఈ పిటిషన్లను విచారించిన బెంచ్... ఈ నెల 14 వరకు వీరిని అరెస్ట్ చేయరాదంటూ ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ 14న జరుగుతుందని తెలిపింది.

  • Loading...

More Telugu News