: పాకిస్థాన్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లిపోతుంది: పాక్ రాజకీయ ఆర్థికవేత్త ఆందోళన


పాకిస్థాన్ పూర్తిగా చైనా నియంత్రణలోకి వెళ్లిపోతుందని పాక్‌ రాజకీయ ఆర్థిక‌వేత్త ఎస్.అక్బర్ జైదీ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. చైనా మొద‌లు పెట్టిన వ‌న్ బెల్ట్ వ‌న్ రోడ్ ప్రాజెక్ట్‌‌‌లో భాగంగా పాక్‌లో చైనా ఎకనమిక్ కారిడార్ పూర్తయిన తర్వాత ఈ ప‌రిస్థితి త‌ప్ప‌కుండా తలెత్తుతుంద‌ని అన్నారు. చైనా కాలనీగా పాక్ మారిపోతుందని తెలిపారు. సీపీఈసీపై చైనాతో ఎంతో చర్చించాల్సి ఉందని అన్నారు. పాకిస్థాన్‌లోని విదేశీ కార్యక్రమాలపై కనీసం పారదర్శకత ఉండాలని ఆయ‌న అన్నారు. చైనా ఆ ప్రాజెక్టు పూర్తి చేస్తే పాక్ ఒక‌ బానిసగా మారి సార్వభౌమత్వాన్ని కోల్పోతుందని జైదీ అన్నారు. చైనా.. పాకిస్థాన్ భౌగోళిక ప్రాంతాన్ని మాత్రమే ఉపయోగించుకుని పర్షియన్ గల్ఫ్ జలాల్లో పాగా వేస్తుందని ఓ సదస్సులో మాట్లాడుతూ తన అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.  

  • Loading...

More Telugu News