: కీలక నిర్ణయం.. టీమిండియా చీఫ్ కోచ్ కుంబ్లే పదవీకాలం పొడిగింపు
భారత క్రికెట్ జట్టు చీఫ్ కోచ్ అనిల్ కుంబ్లే పదవీకాలం ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం ముగియనున్న విషయం తెలిసిందే. ఆ పదవి కోసం ఇప్పటికే బీసీసీఐ దరఖాస్తులను కూడా ఆహ్వానించింది. అయితే, ఛాంపియన్స్ ట్రోఫీ అనంతరం టీమిండియాకి వెస్టిండిస్ తో టోర్నీ ఉండడం, ఇప్పటికీ కొత్త కోచ్ ఎంపిక ప్రక్రియ ముగియకపోవడంతో బీసీసీఐ ఈ రోజు కీలక నిర్ణయం తీసుకుంది. టీమిండియా కోచ్ కుంబ్లే పదవీకాలాన్ని పొడిగిస్తున్నట్లు పేర్కొంటూ, వెస్టిండీస్‌తో సిరీస్ ముగిసేవరకు ఆయన కొనసాగుతారని ప్రకటన చేసింది.