: అందరిముందు దర్శకుడికి లిప్‌కిస్ ఇచ్చిన బాలీవుడ్ హీరో!
బాలీవుడ్ నటులు రణ్‌బీర్ కపూర్, కత్రినా కైఫ్ నటించిన ‘జగ్గా జాసూస్’ సినిమా విడుదలకు సిద్ధమైన నేపథ్యంలో ఆ మూవీ యూనిట్ పబ్లిసిటీ కార్యక్రమాల్లో పాల్గొంటూ అభిమానులను అలరిస్తోంది. నిన్న ఈ సినిమా ప్రచార కార్యక్రమంలో రణ్‌బీర్, దర్శకుడు అనురాగ్ బసు, కత్రినా కైఫ్‌లు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో కార్యక్రమం ముగియగానే అందరూ చూస్తుండగా ఒక్కసారిగా రణ్‌బీర్ కపూర్ దర్శకుడు అనురాగ్ బసుకి లిప్‌కిస్ ఇచ్చాడు. రణ్‌బీర్ కపూర్ ఐదేళ్ల క్రితం కూడా ఇలాగే ప్రవర్తించాడు. అప్పట్లో అనురాగ్ బసు దర్శకత్వంలో వచ్చిన ‘బర్ఫీ’ సినిమా ప్రచారం కార్యక్రమం అనంతరం ఇలాగే కిస్ ఇచ్చాడు. ‘జగ్గా జాసూస్’ సినిమా వచ్చేనెల 14న ప్రేక్షకుల ముందుకు రానుంది.