: చెప్పు దెబ్బలు కావాలా? అంటూ పాకిస్థాన్ క్రికెటర్ కు ఇండియన్ క్రికెటర్ స్ట్రాంగ్ వార్నింగ్... వీడియోలు చూడండి!
పాకిస్థాన్ మాజీ క్రికెటర్ రషీద్ లతీఫ్ కు టీమిండియా క్రికెటర్ మనోజ్ తివారీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. మరోసారి ఇలాంటి వీడియో అప్ లోడ్ చేస్తే చెప్పులతో కొట్టి బుద్ధి చెబుతారని హెచ్చరించాడు. వీరిద్దరి వివాదం వివరాల్లోకి వెళ్తే...పాకిస్థాన్ తో మ్యాచ్ ఫలితం తేలిన అనంతరం 'తండ్రి తండ్రి అవుతాడు బిడ్డ బిడ్డ అవుతాడు' అంటూ టీమిండియా డాషింగ్ మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేశాడు.
దీనిపై పాక్ మాజీ వికెట్ కీపర్ రషీద్ లతీఫ్ తీవ్రంగా స్పందించాడు. నజాఫ్ గడ్ నుంచి సెహ్వాగ్ వచ్చాడని, నజాఫ్ అనే వ్యక్తి ముస్లిం అని, అతని పేరుతో నజాఫ్ గఢ్ పేరు వచ్చిందని, నజాఫ్ గడ్ వాసులందరికీ అతనే తండ్రి అని...శ్రీలంక మీద ఓడిపోయిన టీమిండియాకు ఎవడు తండ్రి అంటూ అభ్యంతరకరంగా విమర్శలు చేశాడు. అంతే కాకుండా భారత్ లో ఉన్న డాన్ లంతా తమ (ముస్లింలే) వారేనని...ఇప్పటికి ఉన్నవారు సరిపోరంటే..తాను కూడా వస్తానని...అప్పుడు ఎవడు తండ్రో?, ఎవడు బిడ్డో? తేలిపోతుందని రెచ్చగొట్టాడు. తరువాతి మ్యాచ్ లో సౌతాఫ్రికాతో ఆడాల్సి ఉంటుందని, హషీమ్ ఆమ్లా, ఇమ్రాన్ తాహిర్ వస్తున్నారని, వారిద్దరూ ఎవరు తండ్రో? ఎవరు బిడ్డో? తేలుస్తారని మరింత తీవ్రంగా మాట్లాడాడు. ఆ వీడియో చూడండి...
దీనిపై యువ ఆటగాడు మనోజ్ తివారీ స్పందించాడు. రషీద్ లతీఫ్ ని ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడమని హెచ్చరించాడు. సెహ్వాగ్ ఎక్కడ?, నువ్వెక్కడ? అంటూ అతని స్థాయిని గుర్తు చేశాడు. పాకిస్థానీలకు ఇంగ్లిష్ రాదన్న విషయాన్ని గుర్తు చేస్తూ...'ఎవడైనా ఇంగ్లిష్ తెలిసినవాడిని పక్కనపెట్టుకుని ఓసారి గూగుల్ లో సెహ్వాగ్ కొట్టిన పరుగులు, నువ్వు కొట్టిన పరుగులు సరిచూసుకో...అప్పుడైనా నీ స్థాయి ఏంటో నీకు తెలుస్తుంది. నువ్వు సెహ్వాగ్ కు సమాధానం చెప్పేంత గొప్పవాడివా?' అని ప్రశ్నించాడు.
'ఇలాంటి వీడియో అప్ లోడ్ చెయ్యడానికి సిగ్గులేదా? దరిద్రుడా?' అని మండిపడ్డాడు. ఇంకోసారి ఇలాంటి వీడియో అప్ లోడ్ చేస్తే చెప్పుతో కొట్టాల్సి వస్తుందని హెచ్చరించాడు. 'ఏం నీలాంటి భాష వాడడం మాకు రాదా? మేము వాడలేమా?' అని ప్రశ్నించాడు. 'నీలాంటి భాషే మేము కూడా వాడితే చెవుల్లోంచి రక్తం కారి చస్తావు' అంటూ హెచ్చరించాడు. 'ఇంకోసారి ఇలాంటి తప్పు చేయకు...నీ వికెట్ కీపింగ్ చూసి, నేర్చుకోవాలనుకునేవారిని నిరాశకు గురి చేయకు' అంటూ హితవు పలికాడు. 'లేదు నేనింతే అని అంటే మాత్రం టీమిండియా క్రికెట్ అభిమానులు చెప్పుతో సమాధానమిస్తారని గుర్తుంచుకో' అంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. ఆ వీడియో చూడండి..