: 100 సంవత్సరాల తరువాత ఫ్లోరిడాలో పండిన పుచ్చకాయలు!
సుమారు వందేళ్ల తరువాత అమెరికాలోని ఫ్లోరిడాలో పుచ్చకాయలను పండించడం ఆసక్తికరంగా మారింది. మొదటి ప్రపంచ యుద్ధం కాలానికి ముందు అమెరికాలో రైతులు పుచ్చకాయలను విరివిగా పండించేవారు. అయితే యుద్ధ కాలంలో స్వదేశీ విత్తనాలకు విపరీతమైన కొరత ఏర్పడింది. దీంతో నెమ్మదిగా పుచ్చకాయలు పండించడం మానేశారు. అయితే మళ్లీ ఇంత కాలానికి ఒక రైతు అమెరికాలో పుచ్చకాయలు పండించాడని అతని స్నేహితుడు చెబుతున్నాడు.
క్రూమ్ (33) అనే రైతు పొలంలోకి వెళ్లిన అతని స్నేహితుడు గ్రేగ్ బెకర్ ఆశ్చర్యపోయాడు. ఎందుకంటే తన స్నేహితుడు పొలంలో పుచ్చకాయలను పండించాడు. ఫ్లోరిడాలో లభించే విత్తనాలను తీసుకుని, వాటిని సంకరీకరించి సరికొత్త వంగడాలను ఉత్పత్తి చేశాడని, గ్రేగ్ చెబుతున్నాడు. అంతే కాకుండా జార్జియాలో పండే రాటిట్ స్నేక్ రకం పుచ్చకాయలంత పేరును ఇప్పుడు తన స్నేహితుడు పండించిన పుచ్చకాయలు కూయడ సంపాదించుకోవాలని ఆకాంక్షించాడు.