: మనవడు వచ్చిన తరువాతే సినారే అంత్యక్రియలు!


ఈ రోజు ఉదయం హైదరాబాదులో మరణించిన డాక్టర్ సి.నారాయణరెడ్డికి ఎల్లుండి జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. సినారే మనవడు డెట్రాయిట్ లో ఉండగా, విషయం తెలుసుకున్న ఆయన బయలుదేరారని, ఎల్లుండి ఉదయానికి ఆయన హైదరాబాద్ కు చేరుకుంటారని, ఆ తరువాత అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు తెలిపారు.

ఈ ఉదయం సినారేకు నివాళులు అర్పించేందుకు వచ్చిన తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ, ఆయన అంత్యక్రియలను అధికార లాంఛనాలతో నిర్వహించాలని నిర్ణయించామని తెలిపారు. ఈ మేరకు కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారని చెప్పారు. బుధవారం ఉదయం 11 గంటలకు అంత్యక్రియలు జరుగుతాయని పేర్కొన్నారు. ఆయన మృతి సినీ పరిశ్రమకు, సాహిత్య లోకానికి తీరనిలోటని, ఆయన కుటుంబానికి ధైర్యాన్ని ఇవ్వాలని భగవంతుడిని కోరుకుంటున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News