: ఇలా ఆడితే ఎలా గెలుస్తాంలే!: ఏబీ డివిలియర్స్ నిర్వేదం


తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్ లో సహచరులంతా వైఫల్యం చెందడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేసిన దక్షిణాఫ్రికా క్రికెట్ జట్టు కెప్టెన్ ఏబీ డివిలియర్స్, భారత ఆటగాళ్లు తమకు అందివచ్చిన ఏ అవకాశాన్నీ వదిలి పెట్టలేదని అన్నాడు. ఇలాగే తమ జట్టు ఆట కొనసాగితే, ఏ మ్యాచ్ నీ గెలవలేమని, తమ ప్రదర్శనపై ఎంతో అసంతృప్తిగా ఉందని తన నిర్వేదాన్ని వ్యక్తం చేశాడు. మ్యాచ్ లో క్రెడిట్ అంతా భారత్ ఆటగాళ్లదేనని అన్నాడు. తాను మంచి కెప్టెన్ నేనని అనుకుంటున్నానని, వరల్డ్ కప్ ను దేశానికి అందించడం కోసం కృషి చేస్తానని అన్నాడు. ఈ టోర్నమెంటును ఇక్కడితో మరచిపోయి, భవిష్యత్ మ్యాచ్ లలో మెరుగ్గా రాణించేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు.

  • Loading...

More Telugu News