: సినారే మా నాన్నకు అత్యంత సన్నిహితులు... ఆయన మరణం సాహితీ లోకానికి లోటు: విక్టరీ వెంకటేష్
ప్రముఖ రచయిత సి.నారాయణ రెడ్డి పార్థివ దేహానికి ప్రముఖ నటుడు వెంకటేష్ నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, తన తండ్రికి సినారే అత్యంత సన్నిహితులని అన్నారు. గొప్ప సాహితీ వేత్త అయిన సినారే మరణం తెలుగు సాహితీ లోకానికి తీరని లోటని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన కుటుంబానికి సానుభూతి తెలియజేస్తున్నానని ఆయన చెప్పారు.
సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు, హాస్య నటుడు బ్రహ్మానందం, గీతరచయిత సుద్దాల అశోక్ తేజ, మాటల రచయిత పరుచూరి గోపాలకృష్ణ తదితరులు ఆయన పార్థివదేహాన్ని సందర్శించి, నివాళులర్పించారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని, ఆయన లేని లోటు పూడ్చలేనిదని వారు చెప్పారు.