: ప్రముఖ కవి, సినీ గేయ రచయిత సినారే కన్నుమూత... సినీలోకం దిగ్భ్రాంతి!


తెలుగు కవి, సాహితీవేత్త, జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత డాక్టర్ సింగిరెడ్డి నారాయణరెడ్డి కొద్దిసేపటి క్రితం కన్నుమూశారు. ఆయన తన కలంపేరు 'సినారే'తో తెలుగు పాఠక, సినీ ప్రేక్షక లోకానికి సుపరిచితులు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన 1931 జూలై 29న కరీంనగర్ జిల్లా హనుమాజీపేటలో రైతు దంపతులు మల్లారెడ్డి, బుచ్చమ్మలకు జన్మించారు. ఆయనది బాల్య వివాహం కాగా, సతీమణి పేరు సుశీల. సినారేకు నలుగురు కుమార్తెలు గంగ, యమున, సరస్వతి, కృష్ణవేణి ఉన్నారు. ఆయన రచించిన విశ్వంభర కావ్యానికి గాను 1988లో ప్రతిష్ఠాత్మకమైన జ్ఞానపీఠ పురస్కారం ఆయన్ను వరించింది. 1977లో ఆయన భారత ప్రభుత్వం నుంచి పద్మశ్రీ, 1992లో పద్మభూషణ్ పురస్కారాలను పొందారు. సినారే మృతి చెందడంపై సినీ పరిశ్రమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. 

  • Loading...

More Telugu News