: అర్ధ సెంచరీలు చేసిన ధావన్, కోహ్లీ


టీమిండియా విజయం దిశగా దూసుకుపోతోంది. ఆదిలోనే రోహిత్ శర్మ (12) వెనుదిరగడంతో ఓపెనర్  శిఖర్ దావన్ (65), కెప్టెన్ విరాట్ కోహ్లీ (50) జాగ్రత్తగా ఆడుతూ, ఎలాంటి తడబాటు లేకుండా ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించారు. 61 బంతుల్లో ఒక సిక్స్, 8 బౌండరీల తరువాత ధావన్ 53 పరుగులు చేశాడు. అనంతరం విరాట్ కోహ్లీ 71 బంతుల్లో 5 బౌండరీలు, ఒక సిక్సర్ సాయంతో 50 పరుగులు చేశాడు. దీంతో 28 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికి భారత జట్టు 143 పరుగులు చేసింది. ప్రస్తుతం క్రీజులో కోహ్లీ (55), ధావన్ (76) ఆడుతున్నారు. సఫారీ బౌలర్లలో మోర్కెట్ ఒక వికెట్ తీశాడు. 

  • Loading...

More Telugu News