: వేదికకు చేరుకుని అభిమానులతో పాట లాంఛ్ చేయించిన అల్లు అర్జున్


డీజే ఆడియో వేడుక జరుగుతున్న శిల్పకళావేదిక దగ్గరకు అల్లు అర్జున్ చేరుకున్నారు. ఆయనను చూడగానే అభిమానుల ఆనందం కట్టలుతెంచుకుంది. అరుపులు, గోల, ఈలలతో అల్లు అర్జున్ కు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సీటీ (ఈల) పాటను అల్లు అర్జున్ అభిమానులతో లాంఛ్ చేశారు. అంతకంటే ముందు ఈ సినిమాలో తొలి పాటను యాంకర్ సుమ చేత లాంఛ్ చేయించారు. ఎన్నో సినిమాల ఆడియో వేడుకలను విజయవంతం చేయడంలో ప్రధాన భూమిక పోషించిన యాంకర్ సుమకు కృతజ్ఞతగా తొలిపాట విడుదల చేయాలని కోరారు. దీంతో పాటను లాంఛ్ చేసిన ఆమె తనకు పాటను విడుదల చేసే భాగ్యం కల్పించిన నిర్మాతకు ధన్యవాదాలు తెలిపారు.

  • Loading...

More Telugu News