: బఫెట్ తో లంచ్ చేయాలంటే చాలా ఖర్చవుతుంది మరి!


ప్రపంచంలోనే స్మార్ట్ ఇన్వెస్టర్ గా పేరొందిన కుబేరుడి వారసుడు వారెన్ బ‌ఫెట్ తో భోజనం చాలా ఖరీదైనది. ప్రతిఏటా ఛారిటీ కోసం లంచ్ లేదా డిన్నర్ ఏర్పాటు చేసే వారెన్ బఫెట్ ఆ సౌకర్యాన్ని ఆన్ లైన్ లో వేలం వేస్తారు. అలా వచ్చిన డబ్బును ఛారిటీకి డొనేట్ చేస్తారు. స్మార్ట్ ఇన్వెస్టర్  గా పేరున్న బఫెట్ తో భోజనం సమయంలో తెలివైన ఇన్వెస్ట్ మెంట్ ఎలా చేయాలో తెలుసుకునే అవకాశం కలుగుతుందని, ఆయన నుంచి వ్యాపార మెలకువలు కూడా తెలుసుకోవచ్చని ఔత్సాహికులు భారీ మొత్తం వెచ్చించి ఆ అవకాశాన్ని వేలం పాట ద్వారా దక్కించుకుంటారు.

తాజాగా ఆయనతో లంచ్ అవకాశం వేలం వేయగా ఓ వ్యక్తి 2,679,001 డాల‌ర్ల బిడ్ దాఖలు చేశారట. అంటే మన కరెన్సీలో 16 కోట్ల రూపాయలకు పైగా ధర పలికింది. కాగా, గత ఏడాది ఈ అవకాశాన్ని దక్కించుకున్న వ్యక్తి 22 కోట్లు ఖర్చు చేయడం విశేషం. ఈ డబ్బును ఆయన గ్లిడె ఫౌండేష‌న్ ‌కు విరాళంగా ఇవ్వ‌నున్నార‌ు. 2004లో తన మొదటి భార్య మరణించిన అనంతరం ఈ ఫౌండేషన్ తో బఫెట్ పని చేస్తున్నారు.

  • Loading...

More Telugu News