: ఆ కేసు మమ్ముట్టి వాదించలేదట!
ప్రముఖ సినీ నటి ఇంద్రజకు మేనేజర్ తో డబ్బు లావాదేవీల్లో వివాదం రేగి ఇద్దరూ కేసులు పెట్టుకున్నారని, ఇంద్రజ తరఫున ఈ కేసును మలయాళ అగ్ర నటుడు మమ్ముట్టి వాదించారని, ఈ కేసును గెలిచి నటనకు ముందు చేపట్టిన వృత్తికి మరోసారి న్యాయం చేశారంటూ వార్తలు వెలువడ్డ సంగతి తెలిసిందే. అయితే అలాంటిదేమీ లేదని ఇంద్రజ చెబుతోంది. అసలు కేసేంటి? తాను కోర్టుకెక్కడమేంటి? అని ఆమె ఆశ్చర్యపోతున్నారు. తాను పెట్టని కేసును... కోర్టులో మమ్ముట్టి వాదించి విజయం సాధించలేరు కదా? అని ఆమె ప్రశ్నిస్తోంది. అవన్నీ ఎవరో పుట్టించిన పుకార్లని కొట్టిపడేసినట్టు తెలుస్తోంది. కాగా, మమ్ముట్టి లా కోర్సు చదివి, సినిమాల్లోకి రాకముందు రెండేళ్లు న్యాయవాదిగా పని చేసిన సంగతి తెలిసిందే.