: ఆరు నెలల్లో కాపులు బీసీలవుతారు: డిప్యూటీ సీఎం చినరాజప్ప
వచ్చే ఆరు నెలల్లోపు కాపులను బీసీల్లో చేరుస్తామని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం చినరాజప్ప స్పష్టం చేశారు. కాపు వెల్ఫేర్.కామ్ మొబైల్ అప్లికేషన్ ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత 30 ఏళ్లలో సాధ్యం కానిదాన్ని చంద్రబాబు ఐదేళ్లలో చేస్తున్నారని అన్నారు. ప్రతి ఒక్కరూ కాపులను బీసీల్లో చేర్చలేదు, చేర్చలేదు అంటున్నారని, అయితే ఒక పని మొదలెట్టగానే వెంటనే అది పూర్తి కాదని ఆయన చెప్పారు. ప్రతి పని అయ్యేందుకు ఒక విధానం, కొంత ప్రణాళిక ఉంటాయని, వాటికి తగ్గట్టే పనులు పూర్తవుతాయని ఆయన తెలిపారు. తాము చెప్పిన ప్రతి పని చేస్తామని ఆయన చెప్పారు. కాపులు ఐక్యంగా ఉండాలని, లేనిపోని ప్రచారాలు నమ్మవద్దని ఆయన చెప్పారు.