: పందెం ఓడిన రచయిత... లైవ్ షోలో పుస్తకంలోని పేజీలను చింపి తినేసిన వైనం!


ఒక రచయిత తాను రాసిన పుస్తకంలోని పేజీలను పరపరా చింపి నోట్లోవేసుకుని నమిలి మింగేశాడు. ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే... బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల సమయంలో కెంట్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా పని చేస్తున్న రచయిత మాథ్యూ గుడ్ విన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా లేబర్ పార్టీ కనీసం ఐదు శాతం ఓట్లు కూడా పొందలేదని చాలెంజ్ చేశాడు. ఒకవేళ తాను చెప్పిన జోస్యం తప్పయితే కనుక 'స్కై న్యూల్ లైవ్' షోలో తాను రాసిన ‘బ్రెగ్జిట్‌: వై బ్రిటన్‌ ఓటెడ్‌ టు లీవ్‌ యూరోపియన్‌ యూనియన్‌’ పుస్తకం కాపీని తింటానని పందెం కాశారు. అయితే ఆయన అంచనాలను తల్లకిందులు చేస్తూ బ్రిటన్ పార్లమెంటు ఎన్నికల్లో లేబర్ పార్టీ జెరెమీ కోర్బిన్ సారథ్యంలో 38 % ఓట్లు పొంది, తమకు ఇంకా ప్రజాదరణ ఉందని నిరూపించింది. దీంతో ఆయన పందెం ఓడినట్టు ప్రకటించి, లైవ్ షో లో తానూ చెప్పినట్టుగా పుస్తకాన్ని తినేశాడు. 

  • Loading...

More Telugu News