: లోకేష్ ను సీఎం చేయండి.. మీరు రాష్ట్రపతిగా వెళ్లండి!: చంద్రబాబుకి టీడీపీ ఎంపీ టీజీ సలహా


ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి బాధ్యతలను నారా లోకేష్ కు అప్పగించాలని తెలుగుదేశం పార్టీ ఎంపీ టీజీ వెంకటేశ్ సీఎం చంద్రబాబునాయుడికి సలహా ఇచ్చారు. ఈ ఉదయం తిరుమలకు వచ్చిన ఆయన, మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రిగా లోకేష్ ను కూర్చోబెట్టి, చంద్రబాబునాయుడు రాష్ట్రపతి పదవిని చేపట్టాలని సూచించారు. రాష్ట్రపతి పదవికి చంద్రబాబు నూటికి నూరు శాతం అర్హుడని అభిప్రాయపడ్డ టీజీ, చంద్రబాబు పేరును ప్రకటిస్తే, ఒకటి, రెండు పార్టీలు మినహా మిగతా అన్ని పార్టీలూ అంగీకరిస్తాయని కూడా అన్నారు.

  • Loading...

More Telugu News