: ఇండియాలో అలీబాబా తొలి డేటా సెంటర్!
చైనా ఈ-కామర్స్ దిగ్గజం అలీబాబా అనుబంధ అలీబాబా క్లౌడ్, ఇండియాలో తన తొలి డేటా సెంటర్ ను ఏర్పాటు చేయనుంది. ప్రపంచంలోనే ఇంటర్నెట్ కు అత్యధికంగా కస్టమర్లున్న దేశంలో తమ డేటా సెంటర్ ను నెలకొల్పనుండటం ఆనందాన్ని కలిగిస్తోందని సంస్థ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ సిమాన్ హూ వెల్లడించారు. ముంబైలో వచ్చే సంవత్సరం మార్చి 31లోగా ఈ సెంటర్ నిర్మాణం పూర్తవుతుందని, ఇదే తరహాలో మరో సెంటర్ ను జకార్తాలో నిర్మించనున్నామని ఆయన తెలిపారు. ఈ సెంటర్ నుంచి ప్రపంచవ్యాప్తంగా క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను అందిస్తామని తెలిపారు. ఈ రీజియన్ లో అలీబాబా మరింతగా విస్తరించేందుకు డేటా సెంటర్ ఉపకరిస్తుందని భావిస్తున్నామని సిమాన్ పేర్కొన్నారు. ఇక్కడి సర్వర్లు అన్ని రకాల సైబర్ దాడులను తట్టుకునేలా ఉంటాయని తెలిపారు. భవిష్యత్తులో యూఎస్, చైనా, ఆస్ట్రేలియా సహా 17 ప్రాంతాల్లో డేటా సెంటర్లను ప్రారంభించే ఆలోచనలో ఉన్నట్టు వెల్లడించారు.