: రేపు సౌతాఫ్రికాతో తాడో పేడో తేల్చుకోనున్న టీమిండియా... అన్ని రకాలుగా సిద్ధమయ్యామన్న కోహ్లీ
ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా మొన్న శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా రేపు సౌతాఫ్రికాతో తాడో పేడో తేల్చుకోనుంది. ఈ మ్యాచ్‌లో విజయం సాధించడం అటు దక్షిణాఫ్రికాకు ఇటు భారత్‌కు కీలకంగా ఉన్న నేపథ్యంలో ఇరు జట్లు ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉన్నాయి. ఈ రోజు మీడియాతో టీమిండియా సారథి విరాట్ కోహ్లీ మాట్లాడుతూ... రేపటి మ్యాచ్‌కు అన్ని రకాలుగా సిద్ధమైనట్లు చెప్పాడు. తమ జట్టు ప్రణాళిక ఏమిటో ఇప్పుడే చెప్పదలుచుకోలేదని అన్నాడు. జట్టును సమతుల్యంగా ఉంచడమే ముఖ్యమని తెలిపాడు. సౌతాఫ్రికాతో మ్యాచును కూడా సాధారణ మ్యాచ్ లాగే తీసుకుని ఆడాలని తమ ఆటగాళ్లకు సూచించాడు. రేపు బరిలోకి దిగనున్న టీమిండియాలో మార్పులు ఉండవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.