: 100 రోజుల పాటు.. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోను పర్యటించనున్న కోదండరాం


తెలంగాణ ఐక్య కార్యాచరణ సమితి ఛైర్మన్ ప్రొ.కోదండరాం రాష్ట్ర పర్యటనను ప్రారంభించనున్నారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లో పర్యటించి, ప్రజల సమస్యలను తెలుసుకోనున్నారు. ఇందుకోసం కార్యాచ‌ర‌ణ రూపొందించుకున్నారు. విడతల వారీగా మొత్తం 100 రోజుల పాటు ఆయ‌న ప‌ర్య‌ట‌న ఉండ‌నుంది. రాష్ట్రంలో ప‌ర్య‌టించాల్సిన ప్రాంతాలపై ఆయ‌న ఓ నిర్ణ‌యం తీసుకోనున్నారు. రేపు రంగారెడ్డిజిల్లా తుర్కంజియాల్‌లో టీజేఏసీ విస్తృత స్థాయి సమావేశం నిర్వ‌హించ‌నున్నారు. ప్రొ.కోదండరాం అధ్య‌క్ష‌త‌న జ‌ర‌గ‌నున్న స‌మావేశంలో రాష్ట్ర పర్యటనపై నేతలు చర్చించనున్నారు.

  • Loading...

More Telugu News