: ప్రతిరోజూ పెట్రోల్ ధరలు మార్చడం కుదరదు: తేల్చి చెప్పేసిన పెట్రోలియం డీలర్లు
15 రోజులకి ఒక్కసారి సమీక్ష చేసే విధానానికి స్వస్తి చెబుతూ ఇకపై ప్రతిరోజు ఇంధన ధరల మార్పుల విధానాన్ని అమలు చేయనున్నట్లు పెట్రోలియం శాఖ ప్రకటించిన తమ నిర్ణయంపై పెట్రోలియం డీలర్లు మండిపడుతున్నారు. ఆ నిర్ణయంపై పునరాలోచన చేయాలని ఈ రోజు పెట్రోలియం, చమురు కంపెనీలకు వారి డీలర్లు లేఖ రాశారు. చమురు కంపెనీల నుంచి నేరుగా ఆటోమేషన్ విధానంలో ధరలు మారేలా చూడాలని పెట్రోలియం డీలర్ల సంఘం ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు కోరారు. బంకుల్లో ప్రతిరోజు ధరలు మార్చడం కుదరదని చెప్పారు.