: నాని కొత్త సినిమా విడుదల తేదీపై స్పష్టతనిచ్చిన సినిమా యూనిట్
టాలీవుడ్ యంగ్ హీరో నాని, డైరెక్టర్ శివ నిర్వాణ కాంబినేషన్‌లో రూపుదిద్దుకుంటున్న ‘నిన్ను కోరి’ చిత్రం విడుదల తేదీపై డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ స్పష్టతనిచ్చింది. ఈ సినిమాను ముందుగా జూన్ 23న విడుదల చేయనున్నట్లు తెలిపిన ఆ సినిమా యూనిట్ పలు కారణాల వల్ల వచ్చేనెల 7న విడుదల చేస్తున్నట్లు అధికారికంగా తెలిపింది. త్వరలోనే ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక జరుపుకోనుంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత డీవీవీ దానయ్య నిర్మిస్తుండగా, గోపి సుందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా టీజర్‌ను ఇటీవలే విడుదల చేయగా అందులో నాని పేల్చిన డైలాగ్ అదుర్స్ అనిపిస్తోంది.