: పెళ్లి నిశ్చయమైన యువతిపై కత్తితో దాడి చేసి చంపేసిన యువకుడు
యాదగిరి గుట్ట సమీపంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. తనను ప్రేమించడం లేదన్న కక్షతో ఓ యువతిని శ్రీకాంత్ అనే ఓ యువకుడు కత్తితో పొడిచి చంపేశాడు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ ఘటనపై పోలీసులు మాట్లాడుతూ వివరాలు చెప్పారు. నిందితుడు శ్రీకాంత్ కొంత కాలంగా బాధిత యువతి వెంట పడుతూ తనను ప్రేమించాలని వేధిస్తున్నాడని అన్నారు. ఆ యువతి మాత్రం శ్రీకాంత్ ప్రేమను నిరాకరిస్తూ ఉందని చెప్పారు. రేపు ఆ యువతికి మరొక యువకుడితో నిశ్చితార్థం జరగనుందని తెలుసుకున్న శ్రీకాంత్.. కత్తితో ఆ యువతి వద్దకు వచ్చి దాడి చేశాడని, గమనించిన స్థానికులు ఆ యువతిని ఆసుపత్రికి తరలించారని చెప్పారు. అయితే, ఆసుపత్రికి తరలించేలోపే ఆ యువతి ప్రాణాలు కోల్పోయిందని చెప్పారు.