: సివిల్స్ టాపర్ నందిని తన తొలి జీతాన్ని ఏం చేయబోతున్నారో తెలుసా?


కర్ణాటకకు చెందిన కేఆర్ నందిని ఈ ఏడాది సివిల్స్ సర్వీసెస్ ఎంపికలో ఆలిండియా టాపర్ గా నిలిచిన సంగతి తెలిసిందే. తాజాగా ఆమె మాట్లాడుతూ తన తొలి ప్రాధాన్యత చదువుకే అని చెప్పారు. తన తొలి వేతనాన్ని ఉచిత విద్యకు అందిస్తానని తెలిపారు. ఆల్వా ఫౌండేషన్ ఉచిత విద్య పథకానికి విరాళంగా ఇస్తానని చెప్పారు. ఫౌండేషన్ ఛైర్మన్ మోహన్ ఆల్వాను కలసిన ఆమె... చదువుకోవాలనే విద్యార్థులకు తాను సహాయసహకారాలను అందిస్తానని తెలిపారు. ఆల్వా ఉచిత విద్య పథకం కింద లబ్ధి పొందిన విద్యార్థుల్లో నందిని కూడా ఒకరు కావడం గమనార్హం. 

  • Loading...

More Telugu News