: రాజసం మా బాబాయి నైజం: హీరో కల్యాణ్ రామ్
ప్రముఖ సినీ నటుడు, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ పుట్టినరోజు నేడు. ఈ సందర్బంగా ఆయన అభిమానులు బాలయ్య జన్మదిన వేడుకలను ఘనంగా జరుపుకుంటున్నారు. బాలయ్య మాత్రం పోర్చుగల్ లో సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు. బాలయ్య జన్మదినం సందర్భంగా హీరో కల్యాణ్ రామ్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. 'రాజసం మా బాబాయ్ నైజం... మా బాలయ్యబాబుకు జన్మదిన శుభాకాంక్షలు' అంటూ ట్విట్టర్లో గ్రీటింగ్స్ చెప్పాడు. దీనికి 'పైపా వసూల్' పోస్టర్ ను జత చేశాడు.
రాజసం మా బాబాయ్ నైజం . మా బాలయ్య బాబు కు జన్మదిన శుభాకాంక్షలు #HappyBirthdayNBK pic.twitter.com/aVoVveZxXW
— Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) June 10, 2017