: భద్రీనాథ్ లో కూలిన హెలికాప్టర్.. ఒకరి మృతి!
ఉత్తరాఖండ్ లోని భద్రీనాథ్ లో ఈ ఉదయం ఓ ప్రైవేట్ హెలికాప్టర్ కూలిపోయింది. ఈ ప్రమాదంలో హెలికాప్టర్ ఇంజినీర్ మృతి చెందాడు. పైలట్లు స్వల్పగాయాలతో బయటపడ్డారు. అయితే, హెలికాప్టర్ లో ఉన్న ఐదుగురు ప్రయాణికులు మాత్రం క్షేమంగా బయటపడ్డారు. హెలికాప్టర్ టేకాఫ్ తీసుకుంటున్న సమయంలో అది కూలిపోయింది. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.