: కంటతడిపెట్టించే ఘటన...ఏడ్చి ఏడ్చి కన్నీళ్లింకిపోయి తల్లి శవంపై నిద్రపోయిన చిన్నారి!


హైదరాబాదులోని ఘట్ కేసర్ రైల్వే స్టేషన్ లో చోటుచేసుకున్న ఓ ఘటన చూపరుల కంట నీరుతెప్పించింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... ఏ ప్రాంతానికి చెందినదో తెలియని ఒక మహిళ ఎక్కడికో వెళ్లేందుకు రైల్వే స్టేషన్ కు చేరుకుంది. మూర్ఛ రోగం కారణంగా అస్వస్థతకు గురైన ఆమె అలాగే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఆమెతో ఉన్న చంటిబిడ్డకు ఈ విషయం తెలుసుకునే పరిపక్వత లేకపోవడంతో తల్లిపాల కోసం మారాం చేశాడు. ఎంత పిలిచినా తల్లి లేవకపోవడంతో కాసేపు అలిగాడు. ఆ తరువాత మళ్లీ తల్లి చెంతకు చేరి ఏడుపులంకించుకున్నాడు. తల్లిపాలు తాగే ప్రయత్నం చేసి, కన్నీళ్లింకిపోయి తల్లి శవంపై ఆదమరచి నిద్రపోయాడు. ఈ ఘటన రైల్వే స్టేషన్ లో చూపరుల కంట నీరుతెప్పించింది. దీంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. వారు వచ్చి ఆమె ఎవరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎక్కడికి వెళ్తున్నారు? వంటి వివరాలు ఆరాతీస్తున్నారు.

  • Loading...

More Telugu News